బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్
గంగాపూర్ గ్రామానికి టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలంలోని గంగాపూర్ గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. జనగామ శాసనసభ్యులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సహకారంతో, గ్రామ సర్పంచ్ శ్రీ జిల్లెల్ల భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) బస్సు సర్వీస్‌ను ఘనంగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు కలిసి బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి, హారతులతో బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. గ్రామ ప్రజలు బస్సుకు ఘన స్వాగతం పలుకుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ బస్సు ద్వారా చేర్యాల – చుంచనకోట – నాగిరెడ్డిపల్లి – గంగాపూర్ – జనగామ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర అవసరాల కోసం సులభంగా ప్రయాణించే అవకాశం కలిగింది.
బస్సు సమయాలు:
చేర్యాల నుండి ఉదయం 9:00 గంటలకు బయలుదేరుతుంది.
చుంచనకోట – 9:10 గంటలకు
నాగిరెడ్డిపల్లి – 9:20 గంటలకు
గంగాపూర్ – 9:30 గంటలకు
జనగామ – 10:00 గంటలకు చేరుకుంటుంది.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీ జిలుకరా కుమారస్వామి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని బస్సు సర్వీస్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.
Comments
Post a Comment