Posts

Showing posts from June, 2026

బచ్చన్నపేట టూ కొడవటూరు గుంత రోడ్డుపై స్పందించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Image
గుంతల రోడ్డుపై కదిలిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులపై తీరు పై సీరియస్!-  కొడవటూర్ దారిలో నరకం చూస్తున్న వాహనదారులు..  కదిలిన ఎంపీ- వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లాలంటూ 'డిఈ' కి ఎంపీ ఆదేశం బచ్చన్నపేట అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న బచ్చన్నపేట - కొడవటూర్ ప్రధాన రహదారి దుస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గత కొంతకాలంగా దాదాపు 2 కిలోమీటర్ మేర రోడ్డు పూర్తిగా పగుళ్లు తేలి, చెరువులను తలపించేలా భారీ గుంతలతో దర్శనమిస్తోంది. నిత్యం వందలాది మంది వాహనదారులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఈ నరకప్రాయమైన రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఎంతోమంది ఇక్కడి గుంతల వల్ల ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నా, రహదారుల శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ నివాసంలో విన్నపం.. తక్షణమే స్పందన!ప్రజల పడుతున్న అవస్థలను చూసి చలించిపోయిన స్థానికులు, ప్రజా ప్రతినిధిపిన్నింటి స్టాన్లీ ఉదయాన్నే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ని వారి గృహం వద్ద కలిసి రోడ్డు దార...

జనగామ నియోజకవర్గంలోని నూతన తాసిల్దార్ భవనాలను నిర్మాణానికి 9 కోట్లతో పరిపాలన అనుమతి అభివృద్ధిలో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి జనగామఎమ్మెల్యే

Image
జనగామ నియోజకవర్గం:తేది: 28-06-2026 ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి కృషి ఫలితం -నాలుగు మండలాలకు నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రూ.9 కోట్ల పరిపాలనా అనుమతి జనగామ: జనగామ నియోజకవర్గంలో రెవెన్యూ పరిపాలనను మరింత ఆధుని కీకరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా మరో కీలక ముంద డుగు పడింది. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు, తదనంతరం ప్రభు త్వంతో సాగించిన సమన్వయ ఫలితంగా తరిగొప్పుల, కొమురవెల్లి, దూల్మిట్ట, మద్దూరు మండల కేంద్రాల్లో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూ రు చేసింది. ఈ నాలుగు మండలాల్లో ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయాలు అద్దె భవ నాల్లో లేదా శిథిలావస్థలో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు, ఉద్యో గులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి, ప్రతిపాదనలు సమర్పించడం ద్వారా ఈ అంశాన్ని నిరంతరం ప్రభుత్వ దృష్టిలో ఉంచారు. ఆయన ప్ర...

అవినీతి అధికారులపై వరంగల్ సిపి ఉక్కు పాదం

Image
ఒకే కేసులో సిఐ, ఎస్.ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సిపి వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ యం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్.ఐ గా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ లో ఉన్న ఎస్.ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన అధికారులు పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తునట్లుగా సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

*నిబంధనల పేరుతో భక్తుల మనోభావాలపై దెబ్బ: కాలనీ అసోసియేషన్ నిర్మించిన దైవ మందిరాన్ని కూల్చివేసిన హైడ్రా!* కే వి ఆర్ వ్యాలీ - మల్లంపేట్ బాచుపల్లి హైదరాబాద్//నగరంలో అభివృద్ధి, నిబంధనల పేరుతో స్థానిక ప్రజల సెంటిమెంట్లను, దశాబ్దాల కాలనీ ఆకాంక్షలను కాలరాస్తూ అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. పచ్చని వాతావరణం, ప్రశాంతత కోసం కాలనీ అసోసియేషన్ ఎంతో భక్తిశ్రద్ధలతో, అందరి సహకారంతో నిర్మించుకున్న ఒక పవిత్ర దైవ మందిరాన్ని 'హైడ్రా' (HYDRAA) అధికారులు ఈరోజు తెల్లవారుజామున జేసీబీలతో కూల్చివేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాలనీవాసుల ఆత్మగౌరవంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాసిల్లుతున్న ఈ ఆలయ కూల్చివేతపై భక్తులు, మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ చర్యను సమర్థించుకుంటూ అధికారులు చెప్తున్న అడ్డగోలు వాదనలపై కాలనీ ప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్నారు. "మేము రోడ్డును ఆక్రమించలేదు, కేవలం నిరుపయోగంగా ఉన్న రోడ్డు డివైడర్ స్థలాన్ని అందంగా మార్చి, అక్కడికి దేవుడిని తీసుకువచ్చి ప్రతిష్టించాం" అని వారు స్పష్టం చేస్తున్నారు. రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, వాహనాల రాకపోకలకు పూర్తి స్థలాన్ని వదిలేసి, కేవలం ఖాళీగా పడి ఉన్న డివైడర్ భాగాన్ని మాత్రమే ఆధ్యాత్మిక అవసరాల కోసం వినియోగించుకున్నామని వారు గుర్తు చేస్తున్నారు. అసలు ప్రజా రవాణాకు ఎలాంటి అడ్డుపడకుండా, దేవుడిని ప్రతిష్టించి పూజలు చేసుకుంటుంటే దాన్ని కూడా 'అక్రమ కట్టడం'గా చిత్రీకరించడం అధికారుల అతి ఉత్సాహానికి నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నగరంలో ఎన్నో చోట్ల భారీ అక్రమ కట్టడాలు, రోడ్లను పూర్తిగా మూసివేసేలా ఉన్న పెద్ద పెద్ద ప్రహరీ గోడలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు తీసుకోని అధికారులు, కేవలం కాలనీవాసులు భక్తితో నిర్మించుకున్న చిన్న మందిరంపై ప్రతాపం చూపడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. భక్తి అనేది సమాజాన్ని కలిపి ఉంచే ఒక అద్భుత శక్తి అని, దేవుడిని రోడ్డు పైకి తీసుకువచ్చి ప్రతిష్టించడం ద్వారా ఆ ప్రాంతంలో క్రమశిక్షణ, ప్రశాంతత పెరిగాయే తప్ప ఎవరికీ నష్టం వాటిల్లలేదని కాలనీ అసోసియేషన్ వాదిస్తోంది. స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించకుండా, వారితో ముందస్తు చర్చలు జరపకుండా ఏకపక్షంగా చేసిన ఈ కూల్చివేత అత్యంత విచారకరమని, తక్షణమే ప్రభుత్వం స్పందించి అదే స్థలంలో ఆలయ పునర్నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Image

ఓటర్ జాబితా సవర్ణ పాదరసంగా జరగాలి: తాసిల్దార్ హుస్సేన్ బచ్చన్నపేట్

Image
 బచ్చన్నపేట మండలంలోని ప్రత్యేక ఓటర్ జాబితాను సవరణ(SIR) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది   అందులో భాగంగా బూత్ స్థాయి అధికారులను మండలంలోని పలు గ్రామాల్లో  ఇంటింటికి తిరిగి ఓటర్ జాబితా పాముని పంపిణీ చేసినారు ఈ సందర్భంగా తాసిల్దార్ హుస్సేన్ మాట్లాడుతూ బి ఎల్ ఓ లకు పలు కీలక సమాచారాన్ని సూచించారు ఓటర్ జాబితా ప్రక్రియ సక్రమంగా సవరణ ఉండాలని  సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి   ఓటర్లు అందరికీ ఫారములు అందజేయాలని సూచించారు వారి వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితంగా నమోదు చేయాలని  ప్రజలకు ఈ ఫారంలను నిర్ణీత గడుపులకు  పూర్తి చేసి సమర్పిచ్చేలా అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శంకర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ మున్వర్ జిపిఓ  సూర్య ప్రకాష్ మరియు సప్న రాజు యాదలక్ష్మి మానస సిద్ధార్థ పలువురు పాల్గొన్నారు 

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

Image
బచ్చన్నపేట మండలంలోని ఆలింపూర్ గ్రామానికి చెందిన పాకాల రవి గత నెలలో మొబైల్ ఫోను పోగొట్టుకున్నాడు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి సాధనం చేసుకున్నారు బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ ఆ మొబైల్ తిరిగి అప్పగించినారు ఈ సందర్భంగా పోయిన మొబైల్స్ అని వస్తువుల పైన గాని వెంటనే పోలీసుల ఫిర్యాదు చేయాలని ఎస్ఐ ప్రజలను కోరినారు  మొబైల్ అందించినందుకు ఎస్ఐకి మరియు పోలీసులకు ధన్యవాదాలు తెలిపినారు మొబైల్ యజమాని  పాకాల రవి

డిజిటల్ విద్యతో విద్యార్థులకు ఉజాల భవిష్యత్

Image
 వి ఎస్ ఆర్ నగర్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం: డిజిటల్ విద్యతోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ,బచ్చన్నపేట: మండలoలోని వి.ఎస్.ఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు నూతన కంప్యూటర్‌ను గ్రామ సర్పంచ్ శ్రీమతి గొడుగు రేణుక కమలాకర్ ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్‌ఫోసిస్ కంప్యూటర్ సొల్యూషన్స్ సౌజన్యంతో పాఠశాలకు కంప్యూటర్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి డిజిటల్ విద్య అందాలనే లక్ష్యంతో ఇన్‌ఫోసిస్ సంస్థ ఈ కంప్యూటర్‌ను విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడిన ఇన్‌ఫోసిస్ ప్రతినిధులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాస్యం కృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ నాలెడ్జ్‌ను అందించాలనే తమ విజ్ఞప్తికి ఇన్‌ఫోసిస్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి రాపాక స్వాతి, రాపాక నాగరాజు తక్షణమే స్పందించి కంప్యూటర్‌ను అందజేశారని కొనియాడారు. ప్రత్యే...

పోలీస్ కళాబృందాల చైతన్య సదస్సు

Image
పోలీస్ జాగృతి కళాబృందంతో ఆధ్వర్యంలో పాటలు  డ్రగ్స్ సైబర్ రోడ్డు భద్రత   భాగంగా పాటలు నటన తో పోలీస్ కళాబృందం వరంగల్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేర బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్ గ్రామంలో ఆట నాటలతో పాటలతో గ్రామంలోని యువకులకు గంజాయి డ్రగ్స్ రోడ్డు భద్రత కార్యక్రమంలో యువత డ్రగ్స్ కు బానిస కావద్దని గంజాయి కి అలవాటు పడవద్దని చిన్న పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బైకులు ఇవ్వద్దని ఎవరైనా గంజాయి అమ్మిన డ్రగ్స్ అలవాటు పడ్డ వారి వివరాలు తెలియజేయాలని  తాగి బైక్స్ గాని వాహనం నడపదు అని యువకులు మేలుకోవాలని బాల్యవివాహాలు బాల కార్మికుల రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి డయల్  100 ఫోన్ చేయాలని అలాగే గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అలాగే వృద్ధ దంపతులను తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అలాగే ఇతర సామాజిక అంశాల  పై పాటల ద్వారా నటన ద్వారా ప్రదర్శిస్తూ సైబర్ క్రైమ్ ఫై ఎలాంటి జరిగిన 1930 డయల్ కాల్ చెయ్యాలని కలబృందాలు ప్రదర్శనతో యువతని గ్రామ ప్రజలను  ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు పాల్గొని విజయవంతం...