డిజిటల్ విద్యతో విద్యార్థులకు ఉజాల భవిష్యత్

 వి ఎస్ ఆర్ నగర్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం: డిజిటల్ విద్యతోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు

,బచ్చన్నపేట:

మండలoలోని వి.ఎస్.ఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు నూతన కంప్యూటర్‌ను గ్రామ సర్పంచ్ శ్రీమతి గొడుగు రేణుక కమలాకర్ ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్‌ఫోసిస్ కంప్యూటర్ సొల్యూషన్స్ సౌజన్యంతో పాఠశాలకు కంప్యూటర్‌ను బహుకరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి డిజిటల్ విద్య అందాలనే లక్ష్యంతో ఇన్‌ఫోసిస్ సంస్థ ఈ కంప్యూటర్‌ను విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడిన ఇన్‌ఫోసిస్ ప్రతినిధులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాస్యం కృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ నాలెడ్జ్‌ను అందించాలనే తమ విజ్ఞప్తికి ఇన్‌ఫోసిస్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి రాపాక స్వాతి, రాపాక నాగరాజు తక్షణమే స్పందించి కంప్యూటర్‌ను అందజేశారని కొనియాడారు. ప్రత్యేక చొరవ చూపి, సహకారం అందించిన జనగామ మండల పి ఆర్ టి యు అధ్యక్షులు బొగ్గారాపు శ్రీనివాస్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు శ్రీమతి గొడుగు మహాలక్ష్మి, చవాన్ జైహింద్, అంగన్‌వాడీ టీచర్ హజీరా, పాఠశాల ఉపాధ్యాయులు పి. రాజేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్