Posts

Showing posts from July, 2026

SIR ను 100/: ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం పూర్తిచేసిన కాంగ్రెస్ పార్టీ లకు ఘన సన్మానం చేసిన బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మండల నాయకులు

Image
ప్రెస్ నోట్ 100% ఎస్‌ఐఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం పూర్తి చేసిన కాంగ్రెస్బీ పార్టీ ఎల్‌ఏలకు ఘన సన్మానం బచ్చన్నపేట మండలంలో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మొదటి ఐదుగురు  భూత్   లేవల్ ఏజెంట్లను (బీఎల్‌ఏలు) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ మసూద్ మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 47 బూతుల్లో ఇప్పటివరకు 24 బూతులు 100 శాతం ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి చేశాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్‌ఏలు సమిష్టిగా కృషి చేయడం వల్ల ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా , కట్కూర్, నీదిగొండ మనించంద్ర తమ్మడపల్లి,రంగు అశోక్   మన్సాన్‌పల్లి, పొన్నం కరుణాకర్  గోపాల్‌నగర్, నగేష్    పోచన్నపేట్ కొక్కలకొండా బాబు లనుశాలువాలతో సన్మానించి అభినందించారు. మిగిలిన బూతుల్లో కూడా త్వరితగతిన ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి చేసి మండలాన్ని 100 శాతం పూర్తి చేసిన మండలంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు వివరాలు సక్రమ...

వర్షాకాలం లో వ్యాధులకు ప్రజలు భయపడకుండా అపరిమితంగా ఉండాలి: బచ్చన్నపేట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు : మహమ్మద్ మసూద్

Image
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్ బచ్చన్నపేట, జూలై 29: వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు, అతిసారం వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్ సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కూలర్లు, డ్రమ్‌లు, ట్యాంకులు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా తరచూ శుభ్రం చేయాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని, తాజా ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. దోమల నివారణ కోసం దోమతెరలు, దోమల నివారణ మందులు ఉపయోగించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ, మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పారిశుధ్య చర్యలను మరింత వేగవంతం చేసి, దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు...

ప్రతి గ్రామపంచాయతీలో సిసి కెమెరాలు కచ్చితంగా అమర్చాలి జిల్లా కలెక్టర్ జనగామ

Image
ప్రతి గ్రామపంచాయతీలో సిసి కెమెరాలు కచ్చితంగా  ఉండాలి  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ అల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోంలతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం సీసీ కెమెరా వ్యవస్థ ఎండో కీలకమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సీసీ వాల్స్ కి అవసరమైన ప్రాంతాలను గుర్తించి మంచి కెమెరాలను ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి టెండర్ ను పూర్తి చేసి ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా సాంకేతిక ప్రమాణాలను పాటించాలని, విద్యుత్ అంతరాయం వచ్చినా రికార్డింగ్ కొనస...

ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కేవైసీ చేయవలసిన అవసరం లేదు అందరూ ఈకే వేసి చేయించుకోవాలి

Image
సమస్త జిల్లా రేషన్ డీలర్ మిత్రులకు ముఖ్య(గమనిక eKYC సేవ లక్ష్యం.. ప్రజల సంక్షేమం 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు e-KYC చేయవలసిన అవసరం లేదు. UNDER 5 సం. ! సమస్త జిల్లా రేషన్ డీలర్ మిత్రులకు తెలియజేయునది ఏమనగా, 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు e-KYC చేయడానికి రాదు. అలాగే వారి ఆధార్ కార్టు అప్డేడేట్ చేయడానికి కూడా 5 సంవత్సరాలు నుండేనే ఉంటేనే వస్తుంది. eKYC X కాబట్టి : 01 5 సంవత్సరాలు నిండని పిల్లల కోసం e-KYC చేయడానికి ప్రయత్పించవద్దు. AADHAAR UPDATE 02 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ముందుగా వారి ఆధార్ కార్డును అప్డేడేట్ చేయంచండి. eKYC 03 అనంతరం e-KYC పూర్తి చేయంచుకోవాలి. సంబంధిత రేషన్ కార్డు సభ్యులకు తెలియజేయండి. గమనిక : 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల రేషన్ బియ్యం యధావిధిగా కొనసాగుతుంది. వారికి e-KYC చేయకపోయనా ఎలాంటి ఇబ్బంది ఉండదు. م పై విషయాన్ని జిల్లా లోని సమస్త రేషన్ డీలర్ మిత్రులు గమనించి, ప్రజలకు సరైన అవగాహన కల్పించగలరు. సేవ లక్ష్యం.. ప్రజల సంక్షేమం జిల్లా మండల గ్రామాల రేషన్ డీలర్స్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ కుటుంబ రికార్డ్ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు సర్కార్ వేగంగా అడుగులు వేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Image
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను మరింత సులభంగా, సారదర్శకంగా అందించేందుకు వీలుగా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో త్వరలోనే 'ఫ్యామిలీ రిజిస్టర్' (కుటుంబ రికార్డు) విధానాన్ని ప్రవేశపెట్టిందుకు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. పౌరులందరికీ ఒకే రకమైన ప్రామాణిక కుటుంబ రికార్డును అందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల డేటాను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఫ్యామిలీ రిజిస్టర్ను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. దీని ద్వారా ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలన్నింటినీ ఒకే రిజిస్టర్లో భద్రపరుస్తారు, దీనివల్ల వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో కుటుంబ వివరాల ధృవీకరణ ప్రక్రియ చాలా సులభతరం కానుంది. రెండు రోజుల్లోనే సర్టిఫికెట్ ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు విధానం: పౌరులు తమకు సమీపంలోని మీసేవా కేంద్రాల ద్వారా లేదా ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న కేవలం రెండు పని దినాల్లో...

భూ వివాదాల్లో చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

Image
భూ వివాదాల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: ఎస్ఐ శ్రీకాంత్ బచ్చన్నపేట. మండలం లోని ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన చెవెళ్ల స్వామిని సోమవారం. తహసీల్దార్ హుస్సేన్ ముందు బైండోవర్ చేసినట్లు.ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో 140 నుంచి 150 సర్వేనంబర్లు ఉన్న భూములకు సంబంధించి ఎటువంటి రెవెన్యూ, న్యాయస్థాన ఆధారాలు లేకుండానే భూ వివాదాలు సృష్టిస్తూ పలుమార్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ప్రజలు భూ వివాదం సంబంధించి స్వయంగా గొడవలకు దిగకుండా, సంబంధిత రెవెన్యూ అధికారులు, న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలన్నారు

పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని భద్రకాళి అమ్మవారికి పూజలు చేశారు

Image
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి *బడే నాగజ్యోతి* గారు భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి, త్వరితగతిన కోలుకొని ప్రజా క్షేత్రంలోకి తిరిగి రావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల మాజీ పార్టీ అధ్యక్షులు సనికొమ్ము రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు వేములపల్లి భిక్షపతి, అకుతోట చంద్రమౌళి, గారిగ రఘు, మాజీ జడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, గండి కుమార్, బైకని సాగర్, పైడిమల్ల భాస్కర్, ఉయ్యాల భద్రయ్య, దొడ్డిపెల్లి రఘుపతి, బీఆర్ఎస్ నాయకులు కొనుకటి ప్రశాంత్, సిద్ధు, చంటి, రాజశేఖర్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

బచ్చన్నపేట గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నరసింహారావు

Image
📢 బచ్చన్నపేట గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి 📢 బచ్చన్నపేట గ్రామ ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా, రేపు సోమవారం సందర్భంగా గ్రామంలోని శివాలయంలో అభిషేకార్థం నీళ్లు పోయడం, అలాగే గ్రామ దేవతల ఆలయాల్లో నీళ్లు సమర్పించి సమృద్ధిగా వర్షాలు కురవాలని సామూహిక ప్రార్థనలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలందరూ తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాము. అలాగే గ్రామ ప్రజలు, కుల సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువత మరియు ప్రజాప్రతినిధులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని మనమందరం కలిసి భగవంతుడిని ప్రార్థిద్దాం. ఇట్లు, అల్వాల నర్సింగరావు సర్పంచ్, బచ్చన్నపేట గ్రామపంచాయతీ

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి :బిజెపి బచ్చన్నపేట మండలం

Image
బచ్చన్నపేట: కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సౌడ రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆరోపించారు. బచ్చన్నపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించిన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు

ఒకే పంపుతో నీటిని తరలించడం వల్ల రైతులు నష్టపోతున్నారు : ఇర్రి రమణారెడ్డి

Image
శబ్దం న్యూస్ జనగామ జిల్లా మండలం బచ్చన్నపేట ఒకే పంపుతో నీటి తరలింపు వల్ల రైతులు నష్టపోతున్నారు- ఇర్రి రమణారెడ్డి సెకండ్, థర్డ్ ఫేజ్ నుంచి నాలుగు మోటర్ల ద్వారా నీటిని తరలించి చెరువులు నింపాలి  ధర్మసాగర్ నుంచి గండిరామారం, బొమ్మకూర్, కన్నెబోయిన గూడెం మీదుగా తపాస్పల్లి వరకు ప్రస్తుతం ఒకే పంపు ద్వారా నీటిని తరలించడం వల్ల బచ్చన్నపేట మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన గండిరామారం, బొమ్మకూర్, కన్నబోయిన గూడెం డ్యాములను సందర్శించి నీటి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అమలులో ఉన్న నీటి సరఫరా విధానం వల్ల సాగునీరు సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ల నుంచి నాలుగు మోటర్ల సహాయంతో నీటిని ఎత్తిపోసి గండిరామారం, బొమ్మకూర్, కన్నెబోయిన గూడెం, తపాస్పల్లి డ్యాములను పూర్తిస్థాయిలో నింపాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి బచ్చన్నపేట మండలంలోని చెరువులకు నీటిని విడుదల చేసి రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిం...

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి: బచ్చన్నపేట: మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. బాధితుడి కుమారుడు మల్యాల నరేష్ పోలీసులకు అందించిన ఫిర్యాదు వివరాల ప్రకారం... జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన మల్యాల బాలయ్య (56) కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. తేదీ 23-07-2026 రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో బాలయ్య కిరాణా షాప్ నుండి సరుకులు కొనుగోలు చేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పోచన్నపేట గ్రామంలోని నారాయణపురం ఎక్స్ రోడ్ వద్ద గల ప్రాథమిక పాఠశాల పక్కన మెయిన్ రోడ్డు దాటుతుండగా, ఆలేరు నుండి బచ్చన్నపేట వైపు వస్తున్న 'TS27 B 5087' నంబర్ గల పల్సర్ 150 (బ్లాక్ కలర్) బైక్ అతనిని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బాలయ్య తల, ఛాతి మరియు రెండు కాళ్లకు తీవ్రమైన రక్త గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు మామిడి మల్లయ్య, గొర్ల ప్రభాకర్, నర్సింగ కిషన్ గమనించి సమాచారం అందించడంతో, కుటుంబ సభ్యులు వెంటనే అతనిని జనగామలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 00:30 గంటల సమయంలో బాలయ్య మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ప్ర...

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ

Image
ప్రెస్ నోట్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను బచ్చన్నపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ మసూద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ మసూద్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల . పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్...

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా బచ్చన్నపేట చౌరస్తాలో మహాధర్నా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

Image
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా బచ్చన్నపేట చౌరస్తాలో కాంగ్రెస్ ధర్నా నీట్ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ - మండల అధ్యక్షుడు మసూద్ నీట్ పరీక్ష అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తున్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి మసూద్ మాట్లాడుతూ, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. విద్యార్థుల తరఫున ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. నీట్ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని, వారి భవిష్యత్తును కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల గొంతును అణచివేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని హెచ్చరించారు. ఈ ధర్నాలో సర్పంచులు ఆల్వాల్ న...

మెట్పల్లి మండలం చింతలపేట గ్రామంలో బేడ బుడగ జంగాల మహిళ దారుణ హత్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్

Image
.గత పది రోజుల కిందట జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో చింతలపేట గ్రామంలో మన బేడ బుడగ జంగాల కులానికి సంబంధించిన మహిళను అతికిరాతకంగా మున్నూరు కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా చెపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ కుల సంఘాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి వర్యులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికితీసుకు వెళ్లడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మంత్రి గారు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని బాధితుల కుటుంబానికిఎనిమిది లక్షల రూపాయలతో పాటు ఇందిరమ్మ ఇల్లు మరియు ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లల చదువు బాధ్యత కూడా మంత్రిగారు తీసుకోవడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు. గౌరవ అధ్యక్షులు తూర్పాటి లింగయ్య. జగిత్యాల జిల్లా అధ్యక్షులు కళ్యాణం శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డొక్కా రంజిత్. తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి-GHMC ఎన్నికల్లో ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి

Image
*రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని–GHMC ఎన్నికల్లో ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని: రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్‌ సత్యనారాయణకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వినతి* హైదరాబాద్ | జూలై 21, 2026: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్ సత్యనారాయణ గారిని మలక్‌పేటలోని ఆయన కార్యాలయంలో కలిసి ప్రత్యేక వినతిపత్రం అందజేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ... ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పింఛన్‌ను రూ.6,000లకు పెంచుతామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, వికలా...

బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి

Image
బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బచ్చన్నపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ మసూద్ గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతరం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పరిశీలించి, పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ఎవరూ ఈ ప్రక్రియకు దూరంగా ఉండకూడదని తెలిపారు. ఓటరు జాబితా పారదర్శకంగా, సంపూర్ణంగా ఉండేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించి వారి వివరాలను నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ లు గ్రామ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), కార్యకర్తలు మరియు పలువురు ప్రజాప్రతినిధులు ...

బేడ బుడగ జంగాల జన సంఘం వ్యవస్థాపన అధ్యక్షుడు సిరిపాటి వేణు ఆదేశాల మేరకు

Image
బేడ బుడగ జంగం-జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సిరిపాటి వేణు గారి ఆదేశాల మేరకు.. ఈ రోజు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి, కుల సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.  బీబీజే సమస్యలపై సానుకూలంగా స్పందించి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన వారికి బేడబుడగ జంగం జనసంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్! ✊ జై పెద్ద గోసాయ్  జై బేడబుడగజంగం

పెండ్లి పోలీస్ ఎక్కడ బాధితులకే పరాభవం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం

Image
పత్రిక ప్రకటన  ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడ, బాధితులకే పరాభవం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండా శివారులో ఉన్నటువంటి రేవుల గడ్డ తండ గ్రామము పరిధిలో శ్రీ ధీరావతు పుష్పావతి భర్త కోటేశ్వరరావు గారి పొలం పక్కన ఉన్నటువంటి ధనావతు కృష్ణ గారు దాదాపుగా రెండు కుంటల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని గత దశాబ్ద కాలంగా జరుగుతున్న గొడవ కు ఇరువురి అంగీకారంతో డిజిటల్ సర్వే చేయగా శ్రీ ధనావతు కృష్ణ గారి పొలంలో దాదాపు రెండు కుంట్ల వరకు భూమి ఎక్కువ ఉన్నది అదేవిధంగా మా పొలములో అనగా ధీరావతు పుష్పావతి భర్త కోటేశ్వరరావు అయిన నేను బాధితురాలుగా పూర్తి ఆధారాలతో జులై 8వ తారీఖున నేను కొండపల్లి ఎస్సై గారికి ఫిర్యాదు చేయడం జరిగినది.  అప్పటి ఎస్ ఐ గారు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము పిలిపించి మాట్లాడుతాము మర్యాదగా రాజీకీ వస్తే ఓకే కాగితాల ప్రకారంగా శ్రీ ధనావుతు కృష్ణ గారికి ఉండాల్సిన పొలం అతనికి ఇచ్చి అదీకంగా ఉన్నటువంటి దాదాపు రెండు కుంటల భూమి మీకు ఇప్పిస్తాం అన్నారు ఒకవేళ ఎందుకు శ్రీధర్ కృష్ణ గారు ఒప్పుకోకపోతే ఎఫ్ ఐ ఆర్ చేసి కోట్లు పంపిస్తాం అన్నారు  మేము ఇట్టి విషయమై మీకు ముట్టినట్టు మాకు రషీద...

ఆర్టీసీని ప్రైవేటుకరణ చేస్తున్నారనే దుర్ ప్రచారాన్ని నమ్మొద్దు : తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షుడు వై వి వి రాజేంద్రప్రసాద్

Image
ఉయ్యూరు   *ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు – తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్*   *ఉయ్యూరులోని రాజేంద్రప్రసాద్ గారి కార్యాలయంలో ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జే.ఏ.సీ నాయకులు రాజేంద్రప్రసాద్ గారి మర్యాదపూర్వకంగా కలిసి మా ఉద్యోగుల పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళమని మెమోరాండం ఇవ్వడం జరిగినది.*  ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ....  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ ఉద్యోగస్తుల కష్టసుఖాలు అన్ని తెలుసని, ఉద్యోగస్తులను గౌరవిస్తూనే వారితో ప్రజలకు సేవ చేయిస్తారని, వైసిపి పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలు ప్రజలు నమ్మవద్దు అని, అలాగే ఈరోజు పిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జే.ఏ.సీ నాయకులు అడిగిన పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.  ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి వాసు, ప్రెసిడెంట్ రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, అసిస్టెంట్ సెక్రటరీ కిషోర్, నేషనల్ యూనిట్ సెక్రటరీ మురళీకృష్ణ, డిపో ప్రెసిడెంట్ శివప్రసాద్, వెంకటేశ్వర్...

పెన్షన్ బిక్షం కాదు అది మా హక్కు సిపిఎస్ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా

Image
 *పెన్షన్ బిక్ష కాదు అది మా హక్కు : సిపిఎస్ ఉద్యోగుల సంఘం*  *సిపిఎస్ ఉద్యోగుల జన జాగరణ యాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపిన TPTF, PRTU, DTF, RUPPTS*  పాత పెన్షన్ పునరుద్ధరణే ధ్యేయంగా సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ గారి సారథ్యంలో జరుగుతున్న జన జాగరణ యాత్ర జులై 28 న ములుగు కు చేరుతున్న సందర్భంగా ములుగు లో జన జాగరణ యాత్ర గోడపత్రిక వివిధ ప్రాంతాలలో ఆవిష్కరించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ అంతమే మా పంతం అని, పెన్షన్ బిక్ష కాదు అది మా ఉద్యోగుల హక్కు అని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ ఉద్యోగుల సంఘం(TSCPSEU) ములుగు జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్, రాష్ట్ర కార్యదర్శి గుల్లగట్టు సంజీవ, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు యాకూబ్ రెడ్డి, ఎస్టియు జిల్లా అధ్యక్షులు శిరుప సతీష్, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆదిరెడ్డి, టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేగ నరేందర్, RUPPTS జిల్లా జనరల్ సెక్రెటరీ సుభాష్, TMSTA జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ బి రాజేందర్, కమలా...

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్

Image
*CMRF చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్*  జనగామ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్ లబ్ధిదారులు అలింపూర్ కు మంతపురి వివేచన్ కు 60.000రూపాయలు కట్కూర్ కు చెందిన మరోజు బుచ్చయ్య చారీ కి 60.000రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ మసూద్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలకు మరింత సేవ చేయడానికి నిరంతరం కృషి చేస్తానని మొహమ్మద్ మసూద్ అన్నారు. ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి జ్యోతి భాస్కర్ సర్పంచ్ అల్వలా నర్సింగరావు సిద్దులగుట్ట ఛైర్మెన్ వెంకట్ రెడ్డి సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ మాజీ మార్కెట్ కమిటీ చై...

న్యాయ వీరులకు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం శుభాకాంక్షలు: చింతల నిర్మల దేవి వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తెలంగాణ

Image
ధర్మదీపం వెలిగించే న్యాయవీరులకు అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు:చింతల నిర్మల రెడ్డి(వైస్ ప్రెసిడెంట్,రాష్ట్ర మహిళా కాంగ్రెస్,తెలంగాణ). న్యాయం అనే నింగిలో వెలిగే నక్షత్రం న్యాయవాది. నిజం అనే మార్గంలో నడిపించే దివ్య దీపం న్యాయవాది. బడుగు బలహీనుల బాధను తన వాదనగా మార్చి,బాధితుని కన్నీటిని న్యాయ విజయంగా తీర్చే మహోన్నత వ్యక్తి. రాజ్యాంగ విలువలే మీ శ్వాస, ధర్మ పరిరక్షణే మీ ధ్యేయం. సత్యమే మీ ఆయుధం. న్యాయమే మీ జీవన మార్గం. సత్యం కోసం సాగిన ప్రతి అడుగు సమాజానికి ఆదర్శం కావాలి. ధర్మం కోసం పలికిన ప్రతి వాదన దేశానికి దిక్సూచి కావాలి. యువ న్యాయవాదులారా… నిజం పక్షాన నిబద్ధతతో నిలవండి. ధర్మం కోసం ధైర్యంగా పోరాడండి. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే న్యాయసేవకులుగా చరిత్రలో నిలిచిపోండి. న్యాయం ప్రతి ఒక్కరికీ సమానంగా అందాలి. అదే ప్రజాస్వామ్యానికి ప్రాణం, అదే రాజ్యాంగానికి గౌరవం, అదే మన భారతదేశ మహోన్నత సంప్రదాయం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయవాదులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

బిఆర్ఎస్ హయాంలోనే గ్రామ అభివృద్ధికి గట్టి పునాది వేసింది జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి

Image
బచ్చన్నపేట మండలం గంగాపూర్లో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధి, గ్రామపంచాయతీల బలోపేతానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా గ్రామాల అభివృద్ధికి బలమైన పునాదులు వేశామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు

పంచాయతీ విధులు నిధులు అధికారులకు తక్షణమే బదిలీ చేయాలి జాతీయ పంచాయతీరాజ్ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్

Image
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా.. 🌹 మా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి అయిన పుసులూరి నరేందర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో, ఖమ్మం జిల్లాలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన మా జాతీయ అధ్యక్షులు వై వి బి రాజేంద్రప్రసాద్ గారికి మరియు ఆంధ్రా మరియు తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర కమిటీల నాయకులకు మరియు జాతీయ కమిటీ ప్రతినిధులకు మా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.. 🌹 అనంతపురం టౌన్ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఎంపీపీల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయిన దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, తదుపరి సమావేశం అనంతపురం జిల్లాలో వచ్చే నెలలో జాతీయ అధ్యక్షులు Y. V. B. రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన జరుగుతుందని తెలియజేయుచున్నాము...  నమస్కారాలతో  చింపుల సత్యనారాయణ రెడ్డి  అధ్యక్షులు  తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్   హైదరాబాద్  రంగారెడ్డి జిల్లా

జనగామ జిల్లా బచ్చన్నపేట లో భారీ చోరీ కేసులు చేదించిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్ వారి నుండి నుండి 15.5 లక్షల సొమ్ము సాధన

Image
బచ్చన్నపేట భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్, రూ.15.5 లక్షల సొత్తు స్వాధీనం ​బచ్చన్నపేట /ప్రజాపక్షం బచ్చన్నపేట మండల కేంద్రంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును జనగామ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.12 లక్షల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.3.50 లక్షల విలువైన 1475 గ్రాముల వెండి వస్తువులు, మూడు మోటార్ సైకిళ్లు, రూ.15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ శ్రీ రాజమహేంద్ర నాయక్ మార్గదర్శకత్వంలో, జనగామ ఇన్‌చార్జి ఏసీపీ భీమ శర్మ పర్యవేక్షణలో, జనగామ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును చేధించింది. ​బాధితుల ఫిర్యాదు - పోలీసుల రంగప్రవేశం ​ఈ నెల 8వ తేదీన బచ్చన్నపేటకు చెందిన దొంతుల సోమలింగం కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి ఈ నెల 10న రాత్రి ఇంటికి వచ్చి చూడగా ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయ...

ఘనంగా ఆదిత్య గ్రాండ్ హోటల్ ప్రారంభం ములుగు జిల్లా

Image
*ఘనంగా అద్విత గ్రాండ్ హోటల్ ప్రారంభం* ములుగు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అద్విత గ్రాండ్ హోటల్ బీఆర్ఎస్ జనగామ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి, జయ శంకర్ భూపాలపల్లి మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి,   ములుగు నియోజకవర్గ ఇంచార్జ్,, మాజీ జడ్పీ చైర్మన్ శ్రీమతి *బడే నాగజ్యోతి- జగదీష్*,రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య, మాజీ రెడ్కో చైర్మన్, వై సతీష్ రెడ్డి, తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్, ఘనంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోటల్ యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారంలో అభివృద్ధి సాధించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన అద్విత గ్రాండ్ హోటల్‌లో లగ్జరీ రూమ్స్, సెంట్రల్ ఏసీ, లిఫ్ట్ సౌకర్యంతో పాటు కుటుంబాలకు అనువైన ఆహ్లాదకరమైన వసతి కల్పించబడింది. అలాగే ప్రతిరోజూ ఉదయం రుచికరమైన టిఫిన్స్, సౌత్ ఇండియన్ & నార్త్ ఇండియన్ నోరూరించే వంటకాలు, పరిశుభ్రమైన వాతావరణంలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. ఈ ప్రారంభోత్సవ కార్యక...

సైబర్ బాధ్యులకు తీపి కబురు మినీ రిస్టోరేషన్ మ్యాడిల్స్ తో డబ్బు వాపస్

Image
*సైబర్ బాధితులకు తీపికబురు.. 'మనీ రిస్టోరేషన్ మాడ్యూల్'తో డబ్బు వాపస్!* సైబర్ మోసాల వారిన పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) తీపికబురు అందించింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు తమ నిధులను సులభంగా తిరిగి పొందేలా సరికొత్త మనీ రిస్టోరేషన్ మాడ్యూబ్ (Money Restoration Module) విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు బ్యూరో డైరెక్టర్, ఐపీఎస్ అధికారిణీ శిఖా గోయెల్ తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) నుంచి రీఫండ్ కు సంబంధించిన ఎస్ఎంఎస్ (SMS), నోటిఫికేషన్ అందుకున్న బాధితులు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ MRM మాడ్యూల్ ద్వారా తమ అభ్యర్థనను సమర్పించవచ్చని స్పష్టం చేశారు. చట్ట సంస్థలతో పాటు బ్యాంకులు సంయుక్తంగా సర్టిఫై చేసిన తర్వాత అర్హులైన బాధితుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జను కానున్నాయి. *డబ్బు తిరిగి పొందడానికి అప్లై చేసే విధానం ఇలా..* సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా బాధితులు ఆరు పద్ధతుల్లో సులభంగా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా సైబర్ క్రైమ్ ఫిర్యాదుకు లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా పోర్టల్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది...

విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని రామన్నపేటలో మహాధర్నా

Image
16/07/2026   *విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని రామన్నపేటలో మహాధర్నా*  విద్యార్థులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో నెంబర్ 9, ఆర్ఆర్ యాక్ట్ ను రద్దు చేయాలి   *ప్రభుత్వ నాయకులు కమిషన్లు రావనే విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు*    *పల్లగొర్ల మోదీరాందేవ్* రామన్నపేట : విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని జీవో నెంబర్ 9ను ఆర్ఆర్ యాక్ట్ రద్దు చేయాలని వేల మంది విద్యార్థులతో రామన్నపేటలో మహా ధర్నా నాయకులకు పోలీసులకు వాగ్వాదం తదినంతరం శాంతియుతంగా ధర్నా ముగించారు *బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ MPఆర్.కృష్ణన్న, బీసీ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్న్ గారి ఆదేశం అనుసారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీజేవైఎం జిల్లా అక్కినపల్లి సైదులు, బిజెపి కార్యవర్గ సభ్యులు పల్లపు దుర్గయ్య, టిఆర్ఎస్ నాయకులు సురేష్, అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు*   రామన్నపేట సుభాష్ సెంటర్లో మహాధర్నా రాస్తారోకో చేశారు విద్యార్థులు వారు మాట్లాడుతూ విద్యార్థులకు రావలసిన 10 వేలకోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు ఇవ్వకుండా పేద విద్యార్థులను వి...

బచ్చన్నపేట మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు ఎక్స్చేంజ్ సూపర్డెంట్ వినతి మూసివేయాలని కోరిన మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సతీష్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు

Image
బచ్చన్నపేట మండలంలో బెల్ట్ షాపులు మూసివేయాలి: ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతి  బచ్చన్నపేట: బచ్చన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేసి, కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తుండటంతో కల్తీ మద్యం సులభంగా అందుబాటులోకి వస్తోందన్నారు. నాణ్యత లేని మద్యం సేవించడం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించడంతో పాటు అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం వ్యసనం కారణంగా కుటుంబాల్లో కలహాలు పెరగడం, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కోవడం, కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం జరుగుతోందన్నారు. రోజువారీ కూలీలు, పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు తమ సంపాదనలో గణనీయమైన భాగాన్ని మద్యం కోసం ఖర్చు చేస్తుండటంతో కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంద...

సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై అక్రమ కేసులు వేధింపులకు గురి చేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ పై ములుగు జిల్లా ఎస్పీ గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన మాజీ రెడ్ కు చైర్మన్ వై సతీష్ రెడ్డి మరియు బిఆర్ఎస్ నాయకులు

Image
*సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల పైన అక్రమ కేసులు, వేధింపులకు గురి చేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ పై ములుగు జిల్లా SP గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన మాజీ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు*  తెలంగాణలో సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు జరుగుతున్నాయంటూ ప్రజా స్వామ్యంలో చట్టాలకి లోబడి పని చేయాలి.అధికార పార్టీకి వంత పాడి అక్రమ కేసులు పెట్టడం సరి కాదు. రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ములుగు జిల్లా ఎస్పీని, కలిసి ఫిర్యాదు చేశారు.   ములుగు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేయడానికి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.. ఈ వివాదాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు:ఎస్పీకి వివరించారు ములుగు జిల్లా పరిధిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను, నేతలను రాత్రికి రాత్రే అక్రమంగా అరెస్టు చేయడం, స్టేషన్లకు తరలించడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.  చట్టవ్యతిరేకంగా వేధింపులకు గురిచేస్తున్న అ...

ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు మా నాన్నని ఆదుకోండి బిడ్డలు

Image
ఆర్థిక సాయం కోసం సాయం చేసి మా నాన్నని కాపాడండి  బచ్చన్నపేట జూలై 16 బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ నివాసి మంగళంపల్లి నాగభూషణం కి బ్రెయిన్ హాస్పిటల్లో నరాలు చితికిపోవడంతో ప్రస్తుతం కోమా కండిషన్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు సర్జరీ మరియు వైద్య ఖర్చులు 7.50 లక్షలు దాటాయి. ఈ క్లిష్ట పరిస్థితిలో వారికి ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కూడా వర్తించడం లేదు. అంత పెద్ద మొత్తంలో ఖర్చు భరించే స్తోమత మా కుటుంబానికి లేదు. మా నాన్న నీ ఎలాగైనా ప్రాణాలతో కాపాడుకోవాలని వారి బిడ్డలమైన మేము (అనూష, అపర్ణ, పూజ) చేతులు జోడించి వేడుకుంటున్నాము. దయార్ద్ర హృదయం గల దాతలు ఎవరైనా ఆర్థికంగా సహాయం చేసి మా నాన్న ప్రాణాలు నిలబెట్టాలని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక సహాయం చేయవలసిన వివరాలు ఫోన్ పే 9441354760 మంగళపల్లి సత్యనారాయణ మీరు చేసే ప్రతి చిన్న సహాయం మా కుటుంబానికి కొండంత అండ అవుతుంది.

తెలంగాణ లోని ఖమ్మం జిల్లా లో జాతీయ పంచాయతీ రాజ్ కార్యవర్గ సమావేశం ముఖ్య అతిథిగా బాబు రాజేంద్రప్రసాద్

Image
ఖమ్మం టౌన్ 👉 మా తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ఆంధ్రా మరియు తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర కమిటీల నాయకులకు మరియు జాతీయ కమిటీ ప్రతినిధులకు మా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.. 👉 తదుపరి సమావేశం అనంతపురం జిల్లాలో వచ్చే నెలలో జాతీయ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన జరుగుతుందని తెలియజేయుచున్నాము...  నమస్కారాలతో  చింపుల సత్యనారాయణ రెడ్డి  అధ్యక్షులు  తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్   హైదరాబాద్  రంగారెడ్డి జిల్లా

ప్రజలను మోసం చేస్తున్న బంగారు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ ప్రజా సంఘం డివిజన్ కార్యదర్శి బేడ బుడగ జంగాల వెంకటేష్

Image
ప్రజలను మోసం చేస్తున్న బంగారం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి  - అంబేద్కర్ ప్రజా సంఘం డివిజన్ కార్యదర్శి బుడగ జంగం వెంకటేష్  తాండూరు, జూన్ 14 : బంగారం అమ్మకాల్లో ప్రజలను మోసం చేస్తున్న బంగారం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ ప్రజా సంఘం తాండూరు డివిజన్ కార్యదర్శి బుడగ జంగం వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని మురుషాద్ దర్గా ప్రాంతానికి చెందిన ఎండి. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి గత మే 26న స్థానిక సరాఫ్ బజార్‌లోని ‘జీపీ జువెలర్స్ దుకాణంలో మహిళలకు సంబంధించిన 3 గ్రాముల బంగారు టాప్స్ కొనుగోలు చేశారు. షాప్ యజమాని 24 క్యారెట్ల బంగారానికి ఉన్న ధరను లెక్కగట్టి, మేకింగ్ ఛార్జీలతో కలిపి మొత్తం రూ. 46,050 వసూలు చేశారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీఎస్టీ బిల్లు ఇవ్వకుండా, దుకాణం పేరు ఉన్న ఒక సాదా కాగితంపై బిల్లు మాత్రం ‘22 క్యారెట్లు’ అని రాసి బాధితుడికి అప్పగించారు.అదే విదంగా తాండూరు పట్టణంలోని మహాలక్ష్మీ జువేల్లర్స్, పవన్‌ జువెల్లర్స్‌ దుకాణాల్లో బంగారు కొనుగోలు చేశారు. ‌ ఇటీవల సదరు బాధితుడికి అత్యవసరంగా డబ్బులు అవసరం పడటంతో ఆ నగ...

బాచుపల్లి లో BLO ల ఆవేదన ఒక్క పని రెండు నీతులా అధికారులపై ఒత్తిడి గాలమెత్తిన శబ్దం

*బాచుపల్లి బీఎల్వోల ఆవేదన.. ఒకే పనికి రెండు నీతులా? అధికారుల ఒత్తిడిపై గళమెత్తిన 'శబ్దం'!* శబ్దం ప్రతినిధి -నిజాంపేట్/ బాచుపల్లి/ప్రగతి నగర్:  ప్రజాస్వామ్య వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ఉంటూ ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ (BLO) మరియు సూపర్‌వైజర్ల పాత్ర అత్యంత కీలకమైనది. కానీ, నేడు వారి పరిస్థితి 'కథలు చెప్పేవాడికి కంచెడు కూడు.. పనిచేసేవాడికి గంపెడు దెబ్బలు' అన్న చందంగా మారింది. బాచుపల్లి మండల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న ఫారాల పంపిణీ వ్యవహారం అధికారుల పక్షపాతానికి, క్షేత్రస్థాయి సిబ్బందిపై జరుగుతున్న దోపిడీకి అద్దం పడుతోంది. ​ *అలవెన్సుల పంపిణీలో ఘోర వివక్ష!* ​బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ పరిధిలోని బీఎల్వోలు ఇప్పటికే 'SIR' ఫారాలను విజయవంతంగా స్కాన్ చేసి సిద్ధంగా ఉంచారు. అయితే, వీరికి రావలసిన ప్రయాణ (TA), దినసరి (DA) భత్యాల విషయంలో అధికారులు తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. ​ఖైరతాబాద్, శేరిలింగంపల్లి పరిధిలోని బీఎల్వోలకు ఫారాల పంపిణీ కోసం ఒక్కొక్కరికీ రూ. 5500 చొప్పున అలవెన్సులు ఇప్పటికే అందాయి. ​కానీ, రాత్రింబగళ్లు కష్టపడుతున్న బాచుపల్లి, ...

క్రాంతి నగర్ కాలనీవాసులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

*క్రాంతి నగర్ కాలనీ వాసులూ.. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి!*  తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.. ఎంతో గర్వించదగ్గ సందర్భం. కానీ, ఈ పవిత్రమైన కార్యక్రమం క్రాంతి నగర్ కాలనీలో జరిగిన తీరు చూస్తుంటే ఆశ్చర్యం, బాధ కలుగుతున్నాయి. కాలనీ అభివృద్ధిలో ఎప్పుడూ ముందుండి, ప్రతి సమస్యలోనూ వెన్నుదన్నుగా నిలిచే నాయకుడు కొలను హనుమంత్ రెడ్డి గారిని ఈ ఆవిష్కరణకు దూరం పెట్టడం వెనుక ఉన్న మర్మం ఏంటి? అసలు సమస్యలేంటో తెలిసిన, అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని పక్కన పెట్టి.. కాలనీ సమస్యలను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం? నిజాయితీగా పనిచేసే నాయకుడు పక్కన ఉంటే తమ 'అవకాశవాద' రాజకీయాలకు అడ్డు వస్తుందనా? లేక నిజం తెలిస్తే కాలనీ వాసులు అడుగుతారనే భయమా? క్రాంతి నగర్ కాలనీవాసులారా.. ఇది మీ కాలనీ, మీ విగ్రహం. ఎవరు నిజమైన నాయకులో, ఎవరు స్వార్థపరులో ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. నిజమైన అభివృద్ధి కోరుకునే నాయకులను గౌరవించుకోలేకపోతే.. భవిష్యత్తులో మన సమస్యలు తీరేదెలా? మౌనంగా ఉండకండి.. ఒక్కసారి ఆలోచించండి!