పెన్షన్ బిక్షం కాదు అది మా హక్కు సిపిఎస్ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా
*పెన్షన్ బిక్ష కాదు అది మా హక్కు : సిపిఎస్ ఉద్యోగుల సంఘం*
*సిపిఎస్ ఉద్యోగుల జన జాగరణ యాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపిన TPTF, PRTU, DTF, RUPPTS*
పాత పెన్షన్ పునరుద్ధరణే ధ్యేయంగా సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ గారి సారథ్యంలో జరుగుతున్న జన జాగరణ యాత్ర జులై 28 న ములుగు కు చేరుతున్న సందర్భంగా ములుగు లో జన జాగరణ యాత్ర గోడపత్రిక వివిధ ప్రాంతాలలో ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ అంతమే మా పంతం అని, పెన్షన్ బిక్ష కాదు అది మా ఉద్యోగుల హక్కు అని తేల్చి చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిపిఎస్ ఉద్యోగుల సంఘం(TSCPSEU) ములుగు జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్, రాష్ట్ర కార్యదర్శి గుల్లగట్టు సంజీవ, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు యాకూబ్ రెడ్డి, ఎస్టియు జిల్లా అధ్యక్షులు శిరుప సతీష్, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆదిరెడ్డి, టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేగ నరేందర్, RUPPTS జిల్లా జనరల్ సెక్రెటరీ సుభాష్, TMSTA జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ బి రాజేందర్, కమలాకర్, రాజయ్య, నాగేశ్వరరావు, రామకృష్ణ, లావుడ్యా రవీందర్, హమీద్, రాజు మరియు భారీ సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Post a Comment