Posts

బచ్చన్నపేటలో కాంగ్రెస్ కమిటీ దరఖాస్తు స్వీకరణ: బచ్చన్నపేట మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్

Image
బచ్చన్నపేటలో కాంగ్రెస్ కమిటీ దరఖాస్తుల స్వీకరణ బచ్చన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి నూతన కమిటీ నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మండలంలోని గ్రామశాఖలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కమిటీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రేపు (ఆదివారం) సాయంత్రం 6 గంటల వరకు మండల కాంగ్రెస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్ కోరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రిలే నిరాహార దీక్ష విరమించిన విజయవంతంగా బీడీ కార్మికులు సరైన యజమాన్యం హామీతో దీక్ష విరమణ

Image
ప్రెస్ నోట్ బచ్చన్నపేట సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష విజయవంతం – యాజమాన్యం హామీతో దీక్ష విరమణ బచ్చన్నపేట సెంటర్ పరిధిలో బీడీ ప్రొడక్షన్ తక్కువగా వస్తోందనే కారణంతో అక్కడ పనిచేస్తున్న బీడీ టికేదారులను కుకునూరుపల్లి సెంటర్‌కు, దుద్దల సెంటర్‌కు మార్చే ఆలోచనలో యాజమాన్యం ఉందని తెలిసిన నేపథ్యంలో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నిర్ణయం అమలైతే స్థానిక కార్మికులు, ప్యాకింగ్ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి బచ్చన్నపేట సెంటర్‌లో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. నాలుగు రోజులుగా కొనసాగిన ఈ దీక్ష నేపథ్యంలో ఈ రోజు యాజమాన్యం తరఫున రేంజ్ మేనేజర్, బీడీ క్వాలిటీ అధికారి దీక్షా శిబిరాన్ని సందర్శించి టేకేదారులు, కార్మిక ప్రతినిధులు మంచే నర్సింలు. శోభన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. బచ్చన్నపేట సెంటర్‌లోనే ప్రొడక్షన్ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, టేకేదారులు కూడా ప్రొడక్షన్ పెంచేందుకు సహకరించాలని కోరారు. అలాగే స్థానిక కార్మికుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యాజమాన్యం ఇచ్చిన హామీపై విశ్వాసంతో ఈ రోజు బచ...

ఎస్సీ ఎస్టీ క్రిమిలేయర్ విధానం వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

Image
న్యూఢిల్లీ: సామాజికంగా వెనకబడిన, అణగారిన వర్గాల్లో ఆర్థికంగా ఉన్నతి సాధించిన కులాలు, వర్గాలకు రిజర్వేషన్లలో అమలుచేస్తున్న క్రీమీలేయర్ విధానం ఎస్సీ, ఎస్టీలకు వర్తించదని సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్రం గురువారం కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ను వర్తింపజేయాలని ప్రభుత్వ ఉపాధిలో రిజర్వేషన్ అమలు ప్రక్రియలో ఈ మేరకు సవరణలు చేయాలని కోరుతూ రామశంకర్ ప్రజాపతి, తదితరులు, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఎదుట ప్రభుత్వం తన వాదనల్ని విన్పించింది. ఎస్సీ, ఎస్టీలకు క్రిమీలేయర్ను వర్తింపజేయనంత మాత్రాన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఏ రకంగా భంగం వాటిల్లుతుందో ఈ వ్యాజ్యాలు నిరూపించలేకపోయాయని ప్రభుత్వం గుర్తుచేసింది. అశోకకుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఎదుట ఈ విషయాన్ని గతంలోనే ప్రభుత్వం తేటతెల్లంచేసింది. ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే శ్రీమీలేయర్ వర్తిస్తుందని సాధారణంగా ప్రభుత్వం చెప్పింది. ఈ భావనలో ఎస్సీ, ఎస్టీలు కలి...

పేకాట స్థావరంపై పోలీసుల దాడి 12మంది అరెస్ట్ : బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

Image
పేకాట స్థావరంపై పోలీసుల దాడి..12 మంది అరెస్ట్ ఎస్సై శ్రీకాంత్ బచ్చన్నపేట/ శబ్దం న్యూస్ జనగామ జిల్లా బచ్చన్నపేట మండల పరిధిలోని పడమటి కేశవాపూర్ గ్రామ శివారులో పామాయిల్ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.59 లక్షల నగదు, మూడు మోటార్ సైకిళ్లు, పేకముక్కలు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా, పడమటి కేశవాపూర్ గ్రామ శివారులోని ఒక పామాయిల్ తోటలో కొందరు వ్యక్తులు పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బచ్చన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న మొత్తం 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేకాటలో వినియోగిస్తున్న రూ.2,59,000 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, పేకముక్కలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం...

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

Image
గంగాపూర్ గ్రామానికి టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలంలోని గంగాపూర్ గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. జనగామ శాసనసభ్యులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సహకారంతో, గ్రామ సర్పంచ్ శ్రీ జిల్లెల్ల భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) బస్సు సర్వీస్‌ను ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు కలిసి బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి, హారతులతో బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. గ్రామ ప్రజలు బస్సుకు ఘన స్వాగతం పలుకుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ బస్సు ద్వారా చేర్యాల – చుంచనకోట – నాగిరెడ్డిపల్లి – గంగాపూర్ – జనగామ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర అవసరాల కోసం సులభంగా ప్రయాణించే అవకాశం కలిగింది. బస్సు సమయాలు: చేర్యాల నుండి ఉదయం 9:00 గంటలకు బయలుదేరుతుంది. చుంచనకోట – 9:10 గంటలకు నాగిరెడ్డిపల్లి – 9:20 గంటలకు గంగాపూర్ – 9:30 గంటలకు జనగామ – 10:00 గంటలక...

బచ్చన్నపేట మండల కేంద్రం నుండి దేశాయి బీడీ కంపెనీ తరలించొద్దు :దేశాయి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

Image
బచ్చన్నపేట నుండి దేశాయి బీడీ కంపెనీ తరలించవద్దు...   వెయ్యి మంది కుటుంబాలు దేశాయి  బీడీ కార్మికులు రోడ్డులో పడతారు...   రిలే నిరాహార దీక్ష ప్రారంభించిన బీడీ కార్మికులు...   జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం దుద్దెడకు తరలిస్తున్న కంపెనీ విరమించుకోవాలని...దేశాయి బీడీ కార్మికుల రిలే నిరాహార దీక్ష మంగళవారం రోజున దేశాయి బీడీ కంపెనీ ముందు ప్రారంభించారు. గత 30 సంవత్సరాల క్రితం ఇందులో ఉపాధి పొందుతున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్న సందర్భంగా... రిలే నిరాహార దీక్షని కొనసాగిస్తాం, అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధమని కార్మికులు తెలిపారు. ఇందులో సుమారు 1000 కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నాయి, దేశాయి బీడీ కంపెనీ తీసివేయడం వల్ల బీడీ కార్మిక కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితి ఏర్పడనున్నది. యజమాన్యం ఇప్పటికైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకోకుంటే ఆమరణ నిరాహార దీక్షచేయడానికి బీడీ కార్మికులం అంత సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మలేరియా డెంగు విష జ్వరాల నుండి దోమలకు నివారణకు పాగిoగ్ చేసుకున్న కొన్నే గ్రామపంచాయతీ

Image
మలేరియా డెంగు దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్న కొన్నే గ్రామపంచాయతీ  బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామపంచాయతీలో మలేరియా డెంగు దోమల నివారణ కొరకు ఈరోజు ఫాగింగ్ కార్యక్రమం చేపట్టిన గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ గ్రామంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా చర్యలు చేపట్టిన గ్రామపంచాయతీ ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చల్ల కమలాకర్ వార్డు మెంబర్లు తేలు శ్రీనివాస్ సందీప్ మరియు రామాంజనేయులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు