పేకాట స్థావరంపై పోలీసుల దాడి 12మంది అరెస్ట్ : బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..12 మంది అరెస్ట్ ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట/ శబ్దం న్యూస్

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల పరిధిలోని పడమటి కేశవాపూర్ గ్రామ శివారులో పామాయిల్ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.59 లక్షల నగదు, మూడు మోటార్ సైకిళ్లు, పేకముక్కలు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా, పడమటి కేశవాపూర్ గ్రామ శివారులోని ఒక పామాయిల్ తోటలో కొందరు వ్యక్తులు పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బచ్చన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న మొత్తం 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేకాటలో వినియోగిస్తున్న రూ.2,59,000 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, పేకముక్కలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే పేకాట, జూదం, గంజాయి, అక్రమ మద్యం విక్రయాలు తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై బచ్చన్నపేట పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పేకాట, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో కీలకమని ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్