రిలే నిరాహార దీక్ష విరమించిన విజయవంతంగా బీడీ కార్మికులు సరైన యజమాన్యం హామీతో దీక్ష విరమణ

ప్రెస్ నోట్
బచ్చన్నపేట సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష విజయవంతం – యాజమాన్యం హామీతో దీక్ష విరమణ
బచ్చన్నపేట సెంటర్ పరిధిలో బీడీ ప్రొడక్షన్ తక్కువగా వస్తోందనే కారణంతో అక్కడ పనిచేస్తున్న బీడీ టికేదారులను కుకునూరుపల్లి సెంటర్‌కు, దుద్దల సెంటర్‌కు మార్చే ఆలోచనలో యాజమాన్యం ఉందని తెలిసిన నేపథ్యంలో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నిర్ణయం అమలైతే స్థానిక కార్మికులు, ప్యాకింగ్ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి బచ్చన్నపేట సెంటర్‌లో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు.
నాలుగు రోజులుగా కొనసాగిన ఈ దీక్ష నేపథ్యంలో ఈ రోజు యాజమాన్యం తరఫున రేంజ్ మేనేజర్, బీడీ క్వాలిటీ అధికారి దీక్షా శిబిరాన్ని సందర్శించి టేకేదారులు, కార్మిక ప్రతినిధులు మంచే నర్సింలు. శోభన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. బచ్చన్నపేట సెంటర్‌లోనే ప్రొడక్షన్ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, టేకేదారులు కూడా ప్రొడక్షన్ పెంచేందుకు సహకరించాలని కోరారు. అలాగే స్థానిక కార్మికుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
యాజమాన్యం ఇచ్చిన హామీపై విశ్వాసంతో ఈ రోజు బచ్చన్నపేట సెంటర్‌లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు కార్మిక ప్రతినిధులు మరియు బీడీ ప్యాకింగ్ కార్మికులు ప్రకటించారు.
ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, యాజమాన్యం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని కోరారు. భవిష్యత్తులో కార్మికుల ఉపాధికి భంగం కలిగించే చర్యలు తీసుకుంటే మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్