భూ వివాదాల్లో చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్
భూ వివాదాల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: ఎస్ఐ శ్రీకాంత్
బచ్చన్నపేట. మండలం లోని ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన చెవెళ్ల స్వామిని సోమవారం. తహసీల్దార్ హుస్సేన్ ముందు బైండోవర్ చేసినట్లు.ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో 140 నుంచి 150 సర్వేనంబర్లు ఉన్న భూములకు సంబంధించి ఎటువంటి రెవెన్యూ, న్యాయస్థాన ఆధారాలు లేకుండానే భూ వివాదాలు సృష్టిస్తూ పలుమార్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ప్రజలు భూ వివాదం సంబంధించి స్వయంగా గొడవలకు దిగకుండా, సంబంధిత రెవెన్యూ అధికారులు, న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలన్నారు
Comments
Post a Comment