సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై అక్రమ కేసులు వేధింపులకు గురి చేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ పై ములుగు జిల్లా ఎస్పీ గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన మాజీ రెడ్ కు చైర్మన్ వై సతీష్ రెడ్డి మరియు బిఆర్ఎస్ నాయకులు

*సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల పైన అక్రమ కేసులు, వేధింపులకు గురి చేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ పై ములుగు జిల్లా SP గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన మాజీ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు* 

తెలంగాణలో సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు జరుగుతున్నాయంటూ ప్రజా స్వామ్యంలో చట్టాలకి లోబడి పని చేయాలి.అధికార పార్టీకి వంత పాడి అక్రమ కేసులు పెట్టడం సరి కాదు. రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ములుగు జిల్లా ఎస్పీని, కలిసి ఫిర్యాదు చేశారు. 

 ములుగు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేయడానికి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు..

ఈ వివాదాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు:ఎస్పీకి వివరించారు ములుగు జిల్లా పరిధిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను, నేతలను రాత్రికి రాత్రే అక్రమంగా అరెస్టు చేయడం, స్టేషన్లకు తరలించడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

చట్టవ్యతిరేకంగా వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ఎస్పీ గారికి వివరించిన వై సతీష్ రెడ్డి గారు

సోషల్ మీడియా పోస్టుల, పేరుతో ప్రభుత్వం ఇష్టానుసారంగా కేసులు పెట్టడాన్ని గతంలో తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీం కోర్టు సైతం తీవ్రంగా తప్పుబట్టింది అని . ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడం సరికాదని స్పష్టం చేసింది. అని వివరించారు

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న యువతను, పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి వేధించడంపై సతీష్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ములుగు జిల్లాలోనూ పార్టీ శ్రేణులు తో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని వివరణ ఇచ్చారు..

 సతీష్ రెడ్డి గారితో ములుగు మాజీ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, , శీలం మధు, బైకని సాగర్, నునావత్ మహేష్ నాయక్,దొడ్డపల్లి రఘుపతి, గొర్రె సమ్మయ్య,మాదం సాగర్, షకీల్ ఉన్నారు..

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్