రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి:
బచ్చన్నపేట:
మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. బాధితుడి కుమారుడు మల్యాల నరేష్ పోలీసులకు అందించిన ఫిర్యాదు వివరాల ప్రకారం... జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన మల్యాల బాలయ్య (56) కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు.
తేదీ 23-07-2026 రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో బాలయ్య కిరాణా షాప్ నుండి సరుకులు కొనుగోలు చేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పోచన్నపేట గ్రామంలోని నారాయణపురం ఎక్స్ రోడ్ వద్ద గల ప్రాథమిక పాఠశాల పక్కన మెయిన్ రోడ్డు దాటుతుండగా, ఆలేరు నుండి బచ్చన్నపేట వైపు వస్తున్న 'TS27 B 5087' నంబర్ గల పల్సర్ 150 (బ్లాక్ కలర్) బైక్ అతనిని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బాలయ్య తల, ఛాతి మరియు రెండు కాళ్లకు తీవ్రమైన రక్త గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు మామిడి మల్లయ్య, గొర్ల ప్రభాకర్, నర్సింగ కిషన్ గమనించి సమాచారం అందించడంతో, కుటుంబ సభ్యులు వెంటనే అతనిని జనగామలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 00:30 గంటల సమయంలో బాలయ్య మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
ఈ ప్రమాదానికి కారణమైన బైక్ నడిపిన వ్యక్తి కెసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ కరీం పాషా (వయస్సు 28, వృత్తి: సూపర్వైజర్) అని తెలిసింది. అతను బైక్ను అతి వేగంగా, అజాగ్రత్తగా నడిపి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి కుమారుడు నరేష్ బచ్చన్నపేట పోలీస్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment