క్రాంతి నగర్ కాలనీవాసులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
*క్రాంతి నగర్ కాలనీ వాసులూ.. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి!*
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.. ఎంతో గర్వించదగ్గ సందర్భం. కానీ, ఈ పవిత్రమైన కార్యక్రమం క్రాంతి నగర్ కాలనీలో జరిగిన తీరు చూస్తుంటే ఆశ్చర్యం, బాధ కలుగుతున్నాయి.
కాలనీ అభివృద్ధిలో ఎప్పుడూ ముందుండి, ప్రతి సమస్యలోనూ వెన్నుదన్నుగా నిలిచే నాయకుడు కొలను హనుమంత్ రెడ్డి గారిని ఈ ఆవిష్కరణకు దూరం పెట్టడం వెనుక ఉన్న మర్మం ఏంటి?
అసలు సమస్యలేంటో తెలిసిన, అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని పక్కన పెట్టి.. కాలనీ సమస్యలను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం? నిజాయితీగా పనిచేసే నాయకుడు పక్కన ఉంటే తమ 'అవకాశవాద' రాజకీయాలకు అడ్డు వస్తుందనా? లేక నిజం తెలిస్తే కాలనీ వాసులు అడుగుతారనే భయమా?
క్రాంతి నగర్ కాలనీవాసులారా.. ఇది మీ కాలనీ, మీ విగ్రహం. ఎవరు నిజమైన నాయకులో, ఎవరు స్వార్థపరులో ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. నిజమైన అభివృద్ధి కోరుకునే నాయకులను గౌరవించుకోలేకపోతే.. భవిష్యత్తులో మన సమస్యలు తీరేదెలా?
మౌనంగా ఉండకండి.. ఒక్కసారి ఆలోచించండి!
Comments
Post a Comment