పంచాయతీ విధులు నిధులు అధికారులకు తక్షణమే బదిలీ చేయాలి జాతీయ పంచాయతీరాజ్ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్
హైదరాబాద్,
రంగారెడ్డి జిల్లా..
🌹 మా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి అయిన పుసులూరి నరేందర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో, ఖమ్మం జిల్లాలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన మా జాతీయ అధ్యక్షులు వై వి బి రాజేంద్రప్రసాద్ గారికి మరియు ఆంధ్రా మరియు తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర కమిటీల నాయకులకు మరియు జాతీయ కమిటీ ప్రతినిధులకు మా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము..
🌹 అనంతపురం టౌన్ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఎంపీపీల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయిన దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, తదుపరి సమావేశం అనంతపురం జిల్లాలో వచ్చే నెలలో జాతీయ అధ్యక్షులు Y. V. B. రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన జరుగుతుందని తెలియజేయుచున్నాము...
నమస్కారాలతో
చింపుల సత్యనారాయణ రెడ్డి
అధ్యక్షులు
తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్
హైదరాబాద్
Comments
Post a Comment