ఆర్టీసీని ప్రైవేటుకరణ చేస్తున్నారనే దుర్ ప్రచారాన్ని నమ్మొద్దు : తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షుడు వై వి వి రాజేంద్రప్రసాద్
ఉయ్యూరు
*ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు – తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్*
*ఉయ్యూరులోని రాజేంద్రప్రసాద్ గారి కార్యాలయంలో ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జే.ఏ.సీ నాయకులు రాజేంద్రప్రసాద్ గారి మర్యాదపూర్వకంగా కలిసి మా ఉద్యోగుల పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళమని మెమోరాండం ఇవ్వడం జరిగినది.*
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ....
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ ఉద్యోగస్తుల కష్టసుఖాలు అన్ని తెలుసని, ఉద్యోగస్తులను గౌరవిస్తూనే వారితో ప్రజలకు సేవ చేయిస్తారని, వైసిపి పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలు ప్రజలు నమ్మవద్దు అని, అలాగే ఈరోజు పిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జే.ఏ.సీ నాయకులు అడిగిన పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.
Comments
Post a Comment