భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ
ప్రెస్ నోట్
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను బచ్చన్నపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ మసూద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ మసూద్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Post a Comment