మెట్పల్లి మండలం చింతలపేట గ్రామంలో బేడ బుడగ జంగాల మహిళ దారుణ హత్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్
.గత పది రోజుల కిందట జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో చింతలపేట గ్రామంలో మన బేడ బుడగ జంగాల కులానికి సంబంధించిన మహిళను అతికిరాతకంగా మున్నూరు కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా చెపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ కుల సంఘాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి వర్యులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికితీసుకు వెళ్లడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మంత్రి గారు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని బాధితుల కుటుంబానికిఎనిమిది లక్షల రూపాయలతో పాటు ఇందిరమ్మ ఇల్లు మరియు ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లల చదువు బాధ్యత కూడా మంత్రిగారు తీసుకోవడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు. గౌరవ అధ్యక్షులు తూర్పాటి లింగయ్య. జగిత్యాల జిల్లా అధ్యక్షులు కళ్యాణం శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డొక్కా రంజిత్. తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment