పెండ్లి పోలీస్ ఎక్కడ బాధితులకే పరాభవం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం
పత్రిక ప్రకటన
ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడ, బాధితులకే పరాభవం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండా శివారులో ఉన్నటువంటి రేవుల గడ్డ తండ గ్రామము పరిధిలో శ్రీ ధీరావతు పుష్పావతి భర్త కోటేశ్వరరావు గారి పొలం పక్కన ఉన్నటువంటి ధనావతు కృష్ణ గారు దాదాపుగా రెండు కుంటల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని గత దశాబ్ద కాలంగా జరుగుతున్న గొడవ కు ఇరువురి అంగీకారంతో డిజిటల్ సర్వే చేయగా శ్రీ ధనావతు కృష్ణ గారి పొలంలో దాదాపు రెండు కుంట్ల వరకు భూమి ఎక్కువ ఉన్నది అదేవిధంగా మా పొలములో అనగా ధీరావతు పుష్పావతి భర్త కోటేశ్వరరావు అయిన నేను బాధితురాలుగా పూర్తి ఆధారాలతో జులై 8వ తారీఖున నేను కొండపల్లి ఎస్సై గారికి ఫిర్యాదు చేయడం జరిగినది.
అప్పటి ఎస్ ఐ గారు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము పిలిపించి మాట్లాడుతాము మర్యాదగా రాజీకీ వస్తే ఓకే కాగితాల ప్రకారంగా శ్రీ ధనావుతు కృష్ణ గారికి ఉండాల్సిన పొలం అతనికి ఇచ్చి అదీకంగా ఉన్నటువంటి దాదాపు రెండు కుంటల భూమి మీకు ఇప్పిస్తాం అన్నారు ఒకవేళ ఎందుకు శ్రీధర్ కృష్ణ గారు ఒప్పుకోకపోతే ఎఫ్ ఐ ఆర్ చేసి కోట్లు పంపిస్తాం అన్నారు
మేము ఇట్టి విషయమై మీకు ముట్టినట్టు మాకు రషీద్ ఇమ్మనగా ఇవ్వలేదు, ఎస్సై గారు మీకు SMS మీకు సమాచారం ఇస్తాము అనగానే మేము ఇంటికి వచ్చేసాము
తేదీ: 18-07-2026, నాడు హైదరాబాద్ లో గల డీజీపీ కార్యాలయం నుండి మాకు ఫోన్ చేసి మా ఫిర్యాదు వివరాలు అడిగారు మాకు న్యాయం జరిగిందా అని అడిగారు మరియు పోలీస్ స్టేషన్లో మీతో ఎలా ప్రవర్తించారు అని అడిగారు మేము అన్నిటికి సమాధానం చెప్పాము. మీ సమస్య పరిష్కారం కాకపోవటానికి కారణం కూడా అడిగారు కాకపోతే మేము అప్పటి ఎస్సై గారు ట్రాన్స్ఫర్ అయ్యారు కొత్త ఎస్ఐ గారు వచ్చారు అన్నాము. మీరు ఒకసారి వెళ్ళండి ఏమి జరిగిందో మాకు చెప్పండి అన్నారు అదే విధంగా మేము ఈరోజు అనగా తేదీ: 20-07-2026, నాడు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కి సందర్శించి మా ఫిర్యాదు పై ఏం యాక్సన్ తీసుకున్నారూ అని అడగగా
సావు కబురు చల్లగా చెప్పినట్టు మీ కంప్లైంట్ క్లోజ్ చేసాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ లిస్టులు ఇద్దరూ మాట్లాడటం జరిగింది, మేము ఫిర్యాదు చేశాము మాకు తెలియకుండా మా కంప్లైంట్ ని ఎట్లా క్లోజ్ చేశారు అని అడగగా వారి నుండి సమాధానం లేదు, లేకపోక ఎదురు దాడి చేసి భయపెట్టడం ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడ అని అయోమయంలో మేము సందిగ్ధంలో పడ్డాము.
SI గారితో ఉపశమనం
చివరగా ఎస్ఐ గారిని ఫోన్ చేసి అడగక ఎస్ఐ గారు సానుకూలంగా విన్నారు వారికి క్లియర్ గా చెప్పడం జరిగింది ధనావతు కృష్ణ గారి పొలములో దాదాపు రెండు కుంటల భూమి ఎక్కువ ఉన్నట్లు డిజిటల్ సర్వే ఆధారాలు మరియు పూర్తి ఆధారాలు కూడా సమర్పించి ఉన్నాం సార్ అని చెప్పాము ఎక్కువ ఉన్న భూమిని మాభూమి మాకు ఇప్పించ మని కోరగా సార్ అవసరమైతే కేస్ ను రీ ఓపెన్ చేస్తాను అని చెప్పడం జరిగింది, కేవలం SI గారి స్పందన ఆధారంగా దాదాపు ఇంకొక వారం రోజులు ఓపికతో ఉంటాము, ఒకవేళ మా సమస్య పరిష్కారం కానీ ఎడల తర్వాత మేము తీసుకునే చర్యలు రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరుగుతుందని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం.
ఈరోజు మాకు కొద్దిగా ఉపశమనం కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారి ద్వారానే కలిగినది కానీ అక్కడున్న సిబ్బంది దురుసుతనము మరియు వారి ప్రవర్తనపై మేము చాలా మనోవేదనకు మరియు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యామని ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాము, భవిష్యత్తులో మాలాగా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని అందుకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.
స్నేహపూర్వక పోలీస్ కు నిదర్శనముగా కేవలం SI గారు ఒక్కరే కాదు కింది స్థాయి సిబ్బందిలలో పూర్తి పరీవర్తన రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము సీనియర్ సిటిజనుగా భావిస్తున్నాము
దీరావతు పుష్పావతి ఆవేదన వ్యక్తం చేశారు
Comments
Post a Comment