పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని భద్రకాళి అమ్మవారికి పూజలు చేశారు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి *బడే నాగజ్యోతి* గారు భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి, త్వరితగతిన కోలుకొని ప్రజా క్షేత్రంలోకి తిరిగి రావాలని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో ములుగు మండల మాజీ పార్టీ అధ్యక్షులు సనికొమ్ము రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు వేములపల్లి భిక్షపతి, అకుతోట చంద్రమౌళి, గారిగ రఘు, మాజీ జడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, గండి కుమార్, బైకని సాగర్, పైడిమల్ల భాస్కర్, ఉయ్యాల భద్రయ్య, దొడ్డిపెల్లి రఘుపతి, బీఆర్ఎస్ నాయకులు కొనుకటి ప్రశాంత్, సిద్ధు, చంటి, రాజశేఖర్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్