వర్షాకాలం లో వ్యాధులకు ప్రజలు భయపడకుండా అపరిమితంగా ఉండాలి: బచ్చన్నపేట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు : మహమ్మద్ మసూద్

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్
బచ్చన్నపేట, జూలై 29:
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు, అతిసారం వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్ సూచించారు.
ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కూలర్లు, డ్రమ్‌లు, ట్యాంకులు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా తరచూ శుభ్రం చేయాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని, తాజా ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. దోమల నివారణ కోసం దోమతెరలు, దోమల నివారణ మందులు ఉపయోగించాలని తెలిపారు.
గ్రామ పంచాయతీ, మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పారిశుధ్య చర్యలను మరింత వేగవంతం చేసి, దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడితే సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చని మొహమ్మద్ మసూద్ పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్