SIR ను 100/: ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం పూర్తిచేసిన కాంగ్రెస్ పార్టీ లకు ఘన సన్మానం చేసిన బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మండల నాయకులు
ప్రెస్ నోట్
100% ఎస్‌ఐఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం పూర్తి చేసిన కాంగ్రెస్బీ పార్టీ ఎల్‌ఏలకు ఘన సన్మానం
బచ్చన్నపేట మండలంలో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మొదటి ఐదుగురు భూత్ లేవల్ ఏజెంట్లను (బీఎల్‌ఏలు) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మొహమ్మద్ మసూద్ మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 47 బూతుల్లో ఇప్పటివరకు 24 బూతులు 100 శాతం ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి చేశాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్‌ఏలు సమిష్టిగా కృషి చేయడం వల్ల ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమైందన్నారు.
ఈ సందర్భంగా , కట్కూర్, నీదిగొండ మనించంద్ర తమ్మడపల్లి,రంగు అశోక్ మన్సాన్‌పల్లి, పొన్నం కరుణాకర్ గోపాల్‌నగర్, నగేష్ పోచన్నపేట్ కొక్కలకొండా బాబు లనుశాలువాలతో సన్మానించి అభినందించారు.
మిగిలిన బూతుల్లో కూడా త్వరితగతిన ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి చేసి మండలాన్ని 100 శాతం పూర్తి చేసిన మండలంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావడం ఎంతో ముఖ్యమని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ స్టేట్ కో ఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి దతరపు నరేష్ సీనియర్ నాయకులు నల్లగోని బాలాకిషన్ సద్ది నర్సిరెడ్డి అంబాల ఆగయ్య జిల్లా సందీప్ గుర్రం బాలరాజ్ స్థానిక రాజు సత్తయ్య నరసింహులు ఓబీసీ సెల్ చెరుకూరి శ్రీనివాస్ బీఎల్‌ఏలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment