ప్రజలను మోసం చేస్తున్న బంగారు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ ప్రజా సంఘం డివిజన్ కార్యదర్శి బేడ బుడగ జంగాల వెంకటేష్
ప్రజలను మోసం చేస్తున్న బంగారం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
- అంబేద్కర్ ప్రజా సంఘం డివిజన్ కార్యదర్శి బుడగ జంగం వెంకటేష్
తాండూరు, జూన్ 14 : బంగారం అమ్మకాల్లో ప్రజలను మోసం చేస్తున్న బంగారం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ ప్రజా సంఘం తాండూరు డివిజన్ కార్యదర్శి బుడగ జంగం వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని మురుషాద్ దర్గా ప్రాంతానికి చెందిన ఎండి. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి గత మే 26న స్థానిక సరాఫ్ బజార్లోని ‘జీపీ జువెలర్స్ దుకాణంలో మహిళలకు సంబంధించిన 3 గ్రాముల బంగారు టాప్స్ కొనుగోలు చేశారు. షాప్ యజమాని 24 క్యారెట్ల బంగారానికి ఉన్న ధరను లెక్కగట్టి, మేకింగ్ ఛార్జీలతో కలిపి మొత్తం రూ. 46,050 వసూలు చేశారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీఎస్టీ బిల్లు ఇవ్వకుండా, దుకాణం పేరు ఉన్న ఒక సాదా కాగితంపై బిల్లు మాత్రం ‘22 క్యారెట్లు’ అని రాసి బాధితుడికి అప్పగించారు.అదే విదంగా తాండూరు పట్టణంలోని మహాలక్ష్మీ జువేల్లర్స్, పవన్ జువెల్లర్స్ దుకాణాల్లో బంగారు కొనుగోలు చేశారు. ఇటీవల సదరు బాధితుడికి అత్యవసరంగా డబ్బులు అవసరం పడటంతో ఆ నగలని అమ్మడానికి వేరే దుకాణానికి వెళ్ళాడు. అక్కడ అది 24 క్యారెట్ల బంగారం కాదని 18 క్యారెట్లు అని తేలింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు హైదరాబాద్లోని అధికారిక గోల్డ్ టెస్టింగ్ సెంటర్లో ఆ నగల నాణ్యతను పరీక్షించారు.అక్కడే బాధితుడికి షాక్ తినే నిజం బయటపడింది. ఆ నగలు కేవలం 18 క్యారెట్ల ప్యూరిటీ మాత్రమే ఉన్నట్లు ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఇలా 24 క్యారెట్ల ధర వసూలు చేసి.. 20 క్యారెట్ల బంగారం ఇచ్చి తనను దారుణంగా మోసం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మోసంపై గతంలో తాండూరు పట్టణ పోలీసు స్టేషన్ లో మే 5న, అలాగే జూన్ 24న రెండుసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఖాతాదారులను నమ్మించి, తప్పుడు ప్యూరిటీతో బంగారు నగలు విక్రయించి మోసానికి పాల్పడుతున్న జువెలరీ షాప్ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరులో ఇలాంటి నకిలీ బంగారు దందా, ప్యూరిటీ మోసాలు ఎక్కువవుతున్నాయని జిల్లా కలెక్టర్,పోలీసు అధికారులు విచారణ చేపట్టి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అజర్, పార్వత్ రెడ్డి, కలిమ్, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment