జనగామ నియోజకవర్గంలోని నూతన తాసిల్దార్ భవనాలను నిర్మాణానికి 9 కోట్లతో పరిపాలన అనుమతి అభివృద్ధిలో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి జనగామఎమ్మెల్యే

జనగామ నియోజకవర్గం:తేది: 28-06-2026

ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి కృషి ఫలితం
-నాలుగు మండలాలకు నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రూ.9 కోట్ల పరిపాలనా అనుమతి

జనగామ:

జనగామ నియోజకవర్గంలో రెవెన్యూ పరిపాలనను మరింత ఆధుని కీకరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా మరో కీలక ముంద డుగు పడింది. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు, తదనంతరం ప్రభు త్వంతో సాగించిన సమన్వయ ఫలితంగా తరిగొప్పుల, కొమురవెల్లి, దూల్మిట్ట, మద్దూరు మండల కేంద్రాల్లో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూ రు చేసింది.

ఈ నాలుగు మండలాల్లో ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయాలు అద్దె భవ నాల్లో లేదా శిథిలావస్థలో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు, ఉద్యో గులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి, ప్రతిపాదనలు సమర్పించడం ద్వారా ఈ అంశాన్ని నిరంతరం ప్రభుత్వ దృష్టిలో ఉంచారు.

ఆయన ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెవెన్యూ శాఖ ద్వారా పరిపాలనా అనుమతులు జారీ చేయడంతో పాటు నిధులను కూడా మంజూరు చేసింది. నాలుగు మండలాల్లో ఒక్కో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల చొప్పున మొత్తం రూ.9 కోట్లు కేటాయించింది.

మొత్తంగా నూతన భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత వేగంగా అందడంతో పాటు ఉద్యోగులకు కూడా మెరుగైన పని వాతావరణం ఏర్పడనుంది. జనగామ నియోజ కవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు నిరంతరం చేస్తున్న కృషికి ఈ పరిపాలనా అనుమతి మరో నిదర్శనమని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్